త్వరలో అక్కినేని బయోపిక్?

Tuesday, April 24th, 2018, 02:28:10 PM IST

ఈ మధ్య కాలంలో బయోపిక్ లు చాలానే తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులకు సంబందించిన సినిమాలంటే ప్రేక్షకులు ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. తారల జీవితాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికే నందమూరి తారక్ రామారావు గారికి సంబందించిన బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తండ్రి పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపించడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు తేజ ఆ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇకపోతే ఎన్టీఆర్ తో సమానంగా ఆయన స్థాయిలో కీర్తిని సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వర రావు గారి బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. అక్కినేని కుటుంబ సభ్యులు కథ కోసం రీసెర్చ్ చేయించారట. యువ ఎఎన్నార్ పాత్రలో నాగ చైతన్య కనిపిస్తారట. ఇక ఆ తరువాత మొత్తం నాగ్ తన తండ్రి పాత్రలో నటించనున్నారని సమాచారం. దాదాపు కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే బయోపిక్ కు సంబందించిన విషయాలను నాగార్జున అధికారికంగా మీడియాకు తెలుపనున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే నాగ్ ప్రెస్ మీట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments