ఇండ‌స్ట్రీ టాక్‌ : అక్కినేని విందు.. టాప్ క్లాస్‌లో..!

Sunday, November 12th, 2017, 06:47:17 PM IST

చై-సామ్ పెళ్లి రిసెప్ష‌న్ ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్‌లో వివాహానంత‌రం హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా పార్టీ ఇచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఎందుక‌నో అది వీలుప‌డ‌లేదు. అయితే చెన్న‌య్ లో నాగ‌చైత‌న్య మ‌ద‌ర్ ఘ‌నంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఆ ఫోటోలు వెబ్‌లోనూ వైర‌ల్ అయ్యాయి. అది అక్కినేని-దగ్గుబాటి ఫ్యామిలీ పార్టీగా అభివ‌ర్ణించారు.

ఇక‌పోతే హైద‌రాబాద్‌లో నేటి సాయంత్రం గ్రాండ్‌గా పార్టీకి ఏర్పాట్లు చేసింది అక్కినేని ఫ్యామిలీ. ఆ మేర‌కు ఇప్ప‌టికే అతిధుల‌కు ఆహ్వానం అందింది. స‌కుటుంబ స‌మేతంగా తామెళ్ల‌రూ విచ్చేసి విందునార‌గించాల్సిందిగా పిలుపు అందింది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు ఇస్తున్న ఈ పార్టీకి ముందే కింగ్ నాగార్జున ప్ర‌త్యేకించి ఇండ‌స్ట్రీ హైఎండ్ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు, కార్పొరెట్‌ వీవీఐపీల‌కు వేరొక ఘ‌న‌మైన‌ పార్టీ ని ఏర్పాటు చేశార‌ని చెబుతున్నారు. మొత్తానికి అక్కినేని రిసెప్ష‌న్ స్కై లెవ‌ల్లో సాగనుంద‌న్న స‌మాచారం అయితే ఉంది. అక్కినేని కుటుంబంలో చాలా కాలానికి ఓ ఆనంద‌క‌ర‌మైన ఫంక్ష‌న్ ఇది. అందుకే నాగార్జున పెద్ద రేంజులోనే ఏర్పాట్లు చేయించారుట‌.

  •  
  •  
  •  
  •  

Comments