అక్షయ్ చొరవతో 29 కోట్ల సాయం

Tuesday, April 10th, 2018, 04:21:42 PM IST

దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీర మరణం పొందిన సైనికులకు దేశమంతా ఋణపడి ఉందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలు కొన్ని దీన స్థితిలో ఉన్నాయి. అందుకోసం అక్షయ్ కుమార్ తనకు తోచిన దారిలో నలుగురి నుంచి విరాళాలు సేకరించి ఆ కుటుంబాలకు చెర వేస్తున్నాడు. భారత్‌ కే వీర్‌’ అనే పేరుతో వెబ్‌సైట్‌ ను అలాగే యాప్‌ను మొదలు పెట్టి ఇప్పటివరకు 159 సైనికుల కుటుంబాలకు సహాయం అందేలా చేశాడు. 2017 ఏప్రిల్ 9న ప్రారంబమైన (www.bharatkeveer.gov.in) ఈ కార్యక్రమం నిన్నటితో ఒక ఏడాదిని పూర్తి చేసుకుంది. ఆ విషయాన్ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 29 కోట్ల విరాళాలతో 159 కుటుంబాలకు ఆర్థిక సహాయాన్నీ అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అదరణని ఇంకా ఇలానే అందిస్తుంటారని అనుకుంటున్నా అని అక్షయ్ ట్వీట్ చేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments