`2.ఓ` 3డి వైర‌స్ అంత‌టా పాకిందే!

Monday, September 10th, 2018, 01:15:25 PM IST

3డి టీజ‌ర్ రిలీజ్ చేస్తున్నాం అంటూ `2.ఓ` ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ర‌జ‌నీకాంత్ అభిమానులకు అస‌లు కునుకే ప‌ట్ట‌డం లేదుట‌. ఓవైపు ర‌జ‌నీ అభిమానుల ప‌రిస్థితి ఇలా ఉంటే ఈ చిత్రంలో క్రౌమ్యాన్‌గా కిలాడీ అక్ష‌య్‌కుమార్ ఎలా క‌నిపిస్తారో చూడాల‌ని అటు ఉత్త‌రాది ఆడియెన్ అంతే ఉత్కంఠ‌గా ఎద‌రు చూస్తున్నారు. మొత్తానికి శంక‌ర్ – లైకా టీమ్ చాలా పెద్ద బాంబ్‌నే పేల్చింది. 3డి, 2డి ట్రీట్ అంటూ ఊరించ‌డంతో జ‌నాల‌కు ఒక‌టే క్యూరియాసిటీ.

వినాయ‌క చ‌వితి కానుక‌గా 2.ఓ టీజ‌ర్‌ని 3డి, 2డిలో ఒకేసారి దేశ‌, విదేశాల్లో అంద‌రికీ అందుబాటులో ఉండేలా రిలీజ్ చేస్తున్నారు. ఇది కొన్ని థియేట‌ర్ల‌లో లైవ్ చేయ‌డ‌మే కాక‌, యూట్యూబ్‌లోనూ అందుబాటులోకొస్తోంది. అందుకోసం 3డి టీజ‌ర్ లాంచ్‌కి అవ‌స‌రం మేర థియేట‌ర్ల‌ను సంసిద్ధం చేస్తున్నారు. టెక్నాల‌జీ అప్‌డేట్‌తో ప్రీప్రిప‌రేష‌న్ ప‌నులు చేస్తున్నార‌ట‌. మొత్తానికి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ 3డి వైర‌స్ పాకిపోతోంది. రొటీన్ 2డి వీక్ష‌కులు సైతం 3డి టీజ‌ర్ గ్లింప్స్‌ని క్యాచ్ చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఇంకో మూడురోజుల్లోనే 3డి విజువ‌ల్ ట్రీట్‌కి అంద‌రూ సిద్ధమే. నిన్న‌టిరోజున కిలాడీ అక్ష‌య్ కుమార్ త‌న బ‌ర్త్ డే సంద‌ర్బంగా అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ .. 2.ఓ చిత్రంలోని క్రౌమ్యాన్ కొత్త పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ అభిమానుల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments