ఆమెతో కలసి టాయిలెట్ లో సెల్ఫీ దిగిన స్టార్ హీరో..అదికూడా మోడీ కోసం..!

Wednesday, November 23rd, 2016, 09:01:42 AM IST

akshay
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విభిన్నపాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూంటాడు. మరో విభిన్న చిత్రం తో ప్రేక్షకులని అలరించాడని అక్షయ్ కుమార్ సిద్ధమవుతున్నాడు. అక్షయ్ తాజాగా ‘టాయిలెట్ – ఏక్ ప్రేమ్ కథా’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ ఆధారంగా తెరకెక్కిస్తుండడం విశేషం.

కాగా ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా అక్షయ్ టాయిలెట్ వద్ద నిలబడి హీరోయిన్ భూమి పెడ్నేకర్ తో దిగిన సెల్ఫీ ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రం లో నటిస్తున్న భూమి పెడ్నేకర్ నేషనల్ అవార్డు ని గెలుచుకున్న ‘దుమ్ లాగాకే ఐషా’ చిత్రం తో ఎంట్రీ ఇచ్చింది. 2017 ప్రథమార్థం లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ కథ మోడీ స్వచ్ఛ్ భారత్ అభియాన్ నేపథ్యం లో ఉంటుందని తెలుస్తోంది.