వేలానికి అక్షయ్‌కుమార్‌ బట్టలు… కొట్లలో పలుకుతున్న ధరలు

Saturday, April 28th, 2018, 02:47:36 PM IST

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరోలలో ముందంజలో ఎవరున్నారు అని చూస్తే అందరికీ మొదటగా గుర్తొచ్చేది అక్షయ్‌కుమార్‌. కేవలం యాక్షన్లోనే కాకుండా ఎలాంటి కథలోనైనా ఇట్టే ఓడిగిపోగల గొప్ప నటుడు. అయితే అక్షయ్ కుమార్ కథానాయకుడిగా రూపొందిన‌ చిత్రం ‘రుస్తుం’. ఫ్రైడేస్‌ ఫిలిం వర్క్‌ పతాకంపై టీనూ సురేష్‌ దేశాయ్‌ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఒక నౌకాదళ అధికారి ‘రుస్తుం పావరి’ దేశం కోసం పోరాడిన అంశం నేపధ్యంతో చిత్రం రూపొందింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ చిత్రంలో అక్షయ్‌ సరసన ఇలియానా, ఈషా గుప్తా, అర్జన్ బజ్వా నటించారు. ముగ్గురు నటీమనులతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరించింది.
2016 ఆగస్టులో విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. బాక్సాఫీసు వద్ద రూ.124 కోట్లు రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ చిత్రంలో అక్ష‌య్ ధ‌రించిన దుస్తుల‌ని వేలం వేశారు. 20 వేల నుండి ప్రారంభ‌మైన ఈ వేలం శుక్రవారం సాయంత్రానికి 3 కోట్ల‌కి చేరింది. మే 26 సాయంత్రం 9.30ని.ల‌కి వేలం ముగియ‌నుంది. వ‌చ్చిన మొత్తాన్ని జంతువుల సంరక్షణ కోసం పనిచేసే ఓ ఎన్జీవో సంస్థకు అక్ష‌య్ విరాళంగా ఇవ్వ‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ‘కేసరి’, ‘గోల్డ్‌’ సినిమాల్లో నటిస్తున్న అక్ష‌య్ శంకర్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన 2.0 చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే .

  •  
  •  
  •  
  •  

Comments