అబ్బాయిలతో కలిసి మందు కొడతానన్న .. నటి ?

Thursday, February 9th, 2017, 11:06:57 AM IST


అబ్బాయిలతో కలిసి మందు కొడితే ఆ కిక్కే వేరప్పా ? అని అంటుంది ఓ నటి. పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తూ ఆకట్టుకున్న ఈ భామ ఎవరనే గా మీ డౌట్ !! ఆ మధ్య నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో పరిచయం అయిన స్నిగ్ధ !! చూడగానే అచ్చం మగాడిలా కనిపించే స్నిగ్ధ కు .. ఆ సినిమా తరువాత అచ్చం అలాంటి పాత్రలే వచ్చాయి. దాంతో అలాగే కంటిన్యూ అయింది. నిజానికి సింగర్ అవ్వాలని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నిగ్ధ కు సింగర్ గా పెద్దగా ఎవరు అవకాశాలు ఇవ్వలేదట .. దాంతో నటిగా మారింది. అబ్బాయిగా కనిపించే స్నిగ్ధ .. అబ్బాయిలతోనే తిరుగుతూ .. వాళ్ళలా మందు కొట్టడం .. వాళ్లతో సరదాగా తిరగడం తనకు చాల ఇష్టమట !!