అల్ల‌రి న‌రేష్‌ని ఆ హీరోయిన్ అన్నా అంటుందా?

Thursday, September 29th, 2016, 12:09:07 AM IST

Allari-Naresh-and-niveda
తెర‌పై ఎలా క‌నిపించిన‌ప్ప‌టికీ తెర వెన‌క నాయ‌కానాయిక‌ల మ‌ధ్య ఉండే అనుబంధం వేరు. సినిమాలో జంట‌గా న‌టించినా, బ‌య‌ట మాత్రం అన్నా చెల్లెలు, అక్క త‌మ్ముడుగా సంబోధించుకొన్న హీరోహీరోయిన్లు పాత‌త‌రంలో ఎక్కువ‌గా క‌నిపించేవాళ్లు. ఈమ‌ధ్య అలాంటి అనుబంధాలు క‌నిపించ‌డం లేదు. అయితే యంగ్ జ‌న‌రేష‌న్ మాత్రం మ‌ళ్లీ మునుప‌టి రోజుల్ని గుర్తు చేసేలానే ఉంది. సినిమాల‌తో సంబంధం లేకుండా వ్య‌క్తిగ‌తంగా వాళ్లు చ‌క్క‌టి బాండింగ్‌ని కొన‌సాగిస్తున్నారు. ఆ బాండింగ్‌లో భాగంగానే క‌థానాయిక నివేదా థామ‌స్‌కి తెలుగులో అల్ల‌రి న‌రేష్ రూపంలో ఓ అన్న‌య్య దొరికాడు. నాని సినిమా జెంటిల్‌మ‌న్‌తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరోయిన్ నివేదా థామ‌స్‌. నాని, న‌రేష్, నివేదా త‌దితరులంతా మంచి ఫ్రెండ్స్. అక్క‌డే న‌రేష్‌కి, నివేదాకి ప‌రిచ‌యం ఏర్ప‌డిన‌ట్టుంది. న‌రేష్‌కి కూతురు పుట్టింద‌ని తెలియ‌గానే ట్విట్ట‌ర్‌లో కంగ్రాట్స్ న‌రేష్ అన్నా అంటూ విష్ చేసింది
నివేదా.