హిచ్‌కాక్‌ని ఫాలో అయ్యి ఎంత ప‌ని చేశావ్ ఆర్జీవీ?

Wednesday, May 2nd, 2018, 03:47:23 PM IST

ఆర్జీవీ అంత ప‌ని చేస్తాడ‌నుకోలేదు!
పెద్ద‌ల మాట చ‌ద్ది మూట అన్నారు! పెద్ద‌లు అనుభ‌వంతో చెప్పేదానిని తూ.చ త‌ప్ప‌క యువ‌త ఆచ‌రించాల‌ని చెబుతుంటారు. అయితే దానినే ఆర్జీవీ అలియాస్ రామ్‌గోపాల్ వ‌ర్మ అనుస‌రించి పెద్ద దెబ్బే కొట్టాడ‌ని అర్థ‌మ‌వుతోంది. గ‌త కొంత‌కాలంగా ఆర్జీవీ ఫ్లాపులు ఇవ్వ‌డానికి అస‌లు కార‌ణం తెలిసొచ్చింది. ఆయ‌న ఒక పెద్దాయ‌న్ని ఫాలో అవుతుంటారు. ఆయ‌న జ‌మానా కాలంలో హాలీవుడ్‌లో గొప్ప గొప్ప క్లాసిక్స్‌నే తీశారు. స‌స్పెన్స్ మెయింటెయిన్ చేస్తూ అద‌రిపోయే థ్రిల్ల‌ర్లు తీశారు .అయితే అవ‌న్నీ ఎలా పురుడు పోసుకున్నాయో ఎవ‌రికైనా ఏమైనా తెలుసా? అంటే .. అదిరిపోయే షాకిచ్చాడు ఆయ‌న‌. ఇంత‌కీ ఆయ‌నెవ‌రు? అంటే.. ప్ర‌ఖ్యాత హాలీవుడ్ ఫిలింమేక‌ర్‌, స‌స్పెన్స్ సినిమాల స్పెష‌లిస్ట్ ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్. అత‌డు త‌న‌కు ఉన్న సుదీర్ఘ అనుభ‌వంతో ఓ కొటేష‌న్‌ని ఇచ్చారు. “సినిమా మొద‌ల‌య్యేది రైటింగ్ టేబుల్ పై .. అప్ప‌టి నుంచి చివ‌రికి ఎడిటింగ్ టేబుల్‌పైకి వ‌చ్చేవ‌ర‌కూ .. ఆ మ‌ధ్య‌లో అస‌లేం జ‌రుగుతుంది.. అన్న‌ది ఎవ‌రూ చెప్ప‌లేరు“ అని ఓ కొటేష‌న్‌ని ఇచ్చారు. దానిని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఆర్జీవీ .. తాను కూడా అదే అనుస‌రించాన‌ని చెప్ప‌క‌నే చెప్పారు.

వాస్త‌వానికి హిచ్‌కాక్ చెప్పిన మాట నిజ‌మే కావొచ్చు కానీ, అది ఆచ‌ర‌ణీయం కాదు. సినిమా మొద‌లు పెట్టే ముందే అన్నీ తెలుసుకోవాలి. తెర‌కెక్కించ‌బోయే విజువ‌ల్స్‌ని ముందే ద‌ర్శ‌కుడు ప‌క్కాగా ఇమాజినేట్ చేసి ఉండాలి. ముందే నిర్మాత‌కు క‌థ చెప్ప‌న‌ట్టే, అచ్చ ంగా అలా తీయ‌గ‌లిగితేనే ఇప్పుడు లైఫ్ ఉంటుంది. అస‌లు ద‌ర్శ‌కుడు కావ‌డ‌మే ఓ స‌వాల్ అనుకుంటే, ఆ త‌ర‌వాత కెరీర్ ప‌రంగా నిల‌దొక్కుకోవ‌డం ఇంకా అతి పెద్ద స‌వాల్. ఇందులో నెగ్గుకు రావాలంటే క‌చ్ఛితంగా ఏ ద‌ర్శ‌కుడికి అయినా ప‌క్కాగా ముంద‌స్తు విజన్, గొప్ప ఇమాజినేష‌న్ ప‌వ‌ర్‌ ఉండాలి. ఆర్జీవీలా ఆన్‌లొకేష‌న్ వెళ్లి ఆలోచిస్తామంటే అస్స‌లు కుద‌ర‌నే కుద‌ర‌దు. ఏదో ఒక సినిమా తీసి, అది చివ‌రికి ఏదో అయ్యి.. గొప్ప‌గా ఉంద‌ని ప్రేక్ష‌కుల నుంచి అనిపించుకునే బాప‌తులో ఉండ‌కూడ‌దు. ఏం తీస్తున్నామో ప‌క్కా క్లారిటీతో ఉన్న‌పుడే న‌వ‌త‌రం ట్యాలెంట్ స‌క్సెస్ సాధించ‌గ‌ల‌దు. ఇక‌పోతే ఆల్‌ఫ్రెడ్ చెప్పిన దానిని బ‌ట్టి ఎడిటింగ్ టేబుల్‌కి ముందు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మధ్య వివాదాలు కానీ, లేదా ఇంకేవైనా త‌లెత్తి ప్రాజెక్టు ఇబ్బ ందుల్లో ప‌డితే దానికి ఎవ‌రూ ఏం చేయ‌లేరు కానీ, అయితే ఇత‌ర‌త్రా విష‌యాల్లో నిర్మాత సొమ్ముల్ని క‌ర్పూరంలా క‌రిగించే యువ‌ద‌ర్శ‌కుల‌దే బాధ్య‌త‌.