ఇంద్రుడితో చంద‌మామ చెలిమి చేసెనే!

Monday, May 28th, 2018, 01:52:39 PM IST

ఇదిగో ఇక్క‌డ ఫోటో చూడ‌గానే క‌లిగే సిందేహమిది. ఇంద్రుడితో చంద‌మామ చెలిమి చేసిందా? ఆ స్నేహంలోనే ప్రేమ ప‌ల్ల‌వించిందా? అని ఇరుగుపొరుగు చెవులు కొరుక్కునేలా ఉందీ దృశ్యం. పెర్ఫెక్ట్ పెయిర్ అన్న ప‌దానికి చిరునామాగా క‌నిపిస్తోంది ఈ పోస్ట‌ర్. అందాల క‌థానాయిక ఆలియాభ‌ట్ .. ర‌ణ‌బీర్ స‌ర‌స‌న `బ్ర‌హ్మాస్త్ర‌` చిత్రంలో న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ పోస్ట‌ర్‌ని లాంచ్ చేయ‌గానే పెయిర్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది అంటూ ప్ర‌శంస‌లు కురిశాయి.

అయితే ఈ సినిమాలో న‌టిస్తుండ‌గానే, ఆ ఇరువురిపైనా బోలెడ‌న్ని రూమ‌ర్లు. ఆలియా ర‌ణ‌బీర్ మాయ‌లో ప‌డింద‌ని.. ఇంద్రుడి ప్రేమ‌లో చిక్కుకున్న చంద్రిక‌లా అయిపోయింద‌ని ఠాంఠాం మోగింది. కొంద‌రైతే ఇంకాస్త అడ్వాన్స్‌డ్‌గా వెళ్లి.. అస‌లు ర‌ణ‌బీర్ అమ్మాయిల్ని వాడుకుని విసిరేస్తాడు. అత‌డితో స్నేహం చేయొద్దు.. అది నీకు మంచిది కాదు అని ఆలియాకి స‌ల‌హానిచ్చారు. అయితే ఈ రూమ‌ర్లు అన్నిటిపైనా ఆ ఇద్ద‌రినీ అడిగితే అట్నుంచి వ‌స్తున్న స‌మాధానం వేరు. ఆ ఇద్ద‌రూ స్నేహంలో ఉన్న మాట నిజం. ఆలియా తాజాగా ఓ చిట్‌చాట్‌లో మాట్లాడుతూ .. అత‌డికి `ఫాస్కినేట్‌`(మాయ‌లో ప‌డిపోయాను) అయ్యాను. ఫాస్కినేట్ అనే ప‌దం ఉప‌యోగించ‌వ‌చ్చో లేదో తెలీదు.. అని న‌వ్వేసింది. ర‌ణ‌బీర్ ప్ర‌వ‌ర్త‌న చూశాక అత‌డి మాయ‌లో ప‌డిపోయాన‌ని ఖ‌రాకండిగా చెప్పేసింది. అత‌డో గొప్ప మాన‌వ‌తావాది అని కితాబిచ్చేసింది. ఇక ర‌ణ‌బీర్‌ని ఈ ఎఫైర్ గురించి క‌దిపితే అత‌డు ఏమ‌న్నాడో తెలుసా? `టూ న్యూ` అంటూ కొట్టి పారేశాడు. కొత్త‌గా ఉందే.. అంటూ అవ‌త‌లివారి ప్ర‌శ్న‌ను తేలిగ్గా తీసిపారేశాడు. మొత్తానికి ఈ జంట మ‌ధ్య ఏం జ‌రుగుతోంది? అన్నది ఇంకా చెప్ప‌లేం.

  •  
  •  
  •  
  •  

Comments