`రాజీ`ప‌డ‌ని ఏకైక యువ‌క‌థానాయిక‌?

Monday, April 9th, 2018, 08:11:38 PM IST

బాలీవుడ్‌లో అత్యంత వేగంగా స్టార్‌డ‌మ్ అందుకున్న యువ‌నాయిక‌గా ఆలియా భ‌ట్ పేరు వినిపిస్తుంది. అంతే వేగంగా ఎఫైర్ల క్వీన్‌గానూ ఈ అమ్మ‌డి పేరు మార్మోగిపోతోంది. తొలుత యువ‌హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాని ప్రేమించిన ఆలియా, ఇప్పుడు అత‌డితో తెగ‌తెంపులు చేసుకుని ర‌ణ‌బీర్‌ని ల‌వ్వాడుతోంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే ఆలియా న‌టించిన క్రేజీ మూవీ `రాజీ` మే 11న రిలీజ్‌కి రెడీ అవుతోంది.

ఈ సంద‌ర్భంగా త‌ర‌ణ్ ఆద‌ర్శ్ కొత్త పోస్ట‌ర్ల‌ను ట్విట్ట‌ర్‌లో రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ల‌లో ఆలియా లుక్ చూస్తుంటే, ఓ ట్రెడిష‌న‌ల్ గాళ్ పాత్ర‌లో ఛాలెంజింగ్ రోల్ పోషిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రంలో ఆలియా స‌ర‌స‌న‌ విక్కీ కౌశ‌ల్ న‌టించాడు. మేఘ‌న గుల్జార్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించారు. రాజీ అన్న టైటిల్ రోల్‌లో ఆలియా న‌టిస్తోంది కాబ‌ట్టి సినిమా జ‌యాప‌జ‌యాల బాధ్య‌త కూడా త‌న‌దే. అయితే స్క్రిప్టు సెల‌క్ష‌న్‌లో రాజీ లేని నాయిక‌గా పేరు తెచ్చుకుంటున్న ఆలియా మ‌రోసారి అలాంటి ఎదురే లేని విజ‌యం అందుకునే ప్ర‌య‌త్న‌మే చేసింద‌ని అర్థ‌మ‌వుతోంది. చూద్దాం.. మ‌రో నెల‌రోజుల్లో సినిమా రిలీజ్ బ‌రిలో దిగుతోంది. రిపోర్ట్ ఏంటో అప్ప‌టికి గానీ తెలీదు.

  •  
  •  
  •  
  •  

Comments