కుర్ర హీరోయిన్‌ ల‌వ్ లైఫ్‌లో ట్ర‌బుల్‌?

Wednesday, October 18th, 2017, 10:20:56 AM IST

యువ‌క‌థానాయిక ఆలియా, యంగ్ బోయ్ సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ఈ ఇద్ద‌రి ప్రేమాయ‌ణం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌. ఆ ఇద్ద‌రూ ఒక‌రిని విడిచి ఒక‌రు వీడ‌లేనంత ఘాడ‌మైన ప్రేమ‌లో ఉన్నారంటూ అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. క‌ట్ చేస్తే ఆర్నెళ్ల‌కు ఆ ఇద్ద‌రి మ‌ధ్యా పొర‌పొచ్చాలొచ్చాయి. దాంతో గొడ‌వ‌ల‌య్యాయి. కుర్చీలు బెంచీలు విరిచేసేంతగా..! అంటూ జ‌నం జోకులేసుకున్నారు. ఇంత జ‌రుగుతోంది అంటే.. అస‌లింత‌కీ ఆ ఇద్ద‌రూ క‌లిసే ఉన్నారా? విడిపోయారా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. కానీ ఆ ఇద్ద‌రూ ఎవ‌రూ ఊహించ‌ని ట్విస్టులిస్తున్నారు. జ‌నాల మైండ్‌కి అర్థంకాని ఫ‌జిల్ వేస్తున్నారు.

ఇద్ద‌రూ క‌లిసే పార్టీల‌కు వెళుతున్నారు. షికార్లు చేస్తున్నారు. కానీ ఇలా పార్టీల వేళ మూడీగా ఉంటున్నారు. ఆ ఇద్ద‌రిమ‌ధ్యా ఏదో జ‌రిగింది అని ఇత‌రులు క‌నిపెట్టేసేంతగా దొరికిపోతున్నారు. ప్రేయ‌సీప్రియులు అన్నాక కొట్టుకుంటారు. తిట్టుకుంటారు.. క‌రుచుకుంటారు. అంత మాత్రాన నానా ర‌చ్చే చేయ‌డం త‌గునా? కానీ ఉత్త‌రాది మీడియా మాత్రం ఓ రేంజులో ఆ ఇద్ద‌రి బ్రేక‌ప్ గురించి ప్ర‌చారం చేస్తోంది. మొన్న‌టికి మొన్న దీపావ‌ళి వేళ ప‌లువురు టాప్ సెల‌బ్రిటీలు పార్టీల‌తో హోరెత్తించారు. మొన్న ఏక్తా క‌పూర్ దీపావ‌ళి పార్టీలో, అటు మొన్న‌ సంజ‌య్ క‌పూర్ బ‌ర్త్‌డే పార్టీలో ఈ ఇద్ద‌రూ క‌లిసే క‌నిపించారు.. కానీ ఏదో తేడా కొడుతోంది అంటూ జ‌నాలంతా మాట్లాడుకున్నారు. పార్టీ వేళ ఒక‌రికొక‌రు అంటీ ముట్ట‌న‌ట్టు క‌నిపించేసరికి ఏమైంది వీళ్ల‌కు అంటూ సందేహం వ్య‌క్తం చేశారు జ‌నం. అస‌లేమైందో సిద్ధార్థ్‌, ఆలియాలో ఎవ‌రో ఒక‌రైనా చెప్పాలి. ఇటీవ‌లి కాలంలో ఇద్ద‌రిమ‌ధ్యా మాటా మంతీ లేదు. ఇక ప్రేమ‌కు ప‌ర్మినెంట్‌గా కటీప్ చెప్పేసిన‌ట్టేనంటూ ప్ర‌చార‌మ‌వుతోంది కాబ‌ట్టి సీరియ‌స్‌గా ఎవ‌రో ఒక‌రు ఈ విష‌యంపై క్లారిటీనివ్వాలి. క‌లిసే ఉన్నారా? విడిపోయారా?

  •  
  •  
  •  
  •  

Comments