వీడియో : ఆలియా .. మ‌తి చెడుతుందంతే!

Saturday, April 21st, 2018, 11:07:00 PM IST

అందానికి అందం … క్రేజు ఉన్న న‌వ‌త‌రం నాయిక ఆలియాభ‌ట్‌. క‌ర‌ణ్ జోహార్ ఈ అందాల భామ‌ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేశారు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్‌` చిత్రంతో యూత్ ఐక‌న్‌గా వెలిగిపోయింది. ఆ త‌ర‌వాత వ‌రుస‌గా ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టించి బంప‌ర్ హిట్లు కొట్టింది. తాజాగా ఈ భామ న‌టించిన రాజీ రిలీజ్‌కి రెడీ అవుతోంది. రాజీ ట్రైల‌ర్ ఇదివ‌ర‌కూ రిలీజై ఆక‌ట్టుకుంది. ఈసారి `రోజా` చిత్రంలో మ‌ధుబాల పోషించిన త‌ర‌హా పాత్ర‌లో ఆలియా న‌టించింద‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైంది.

అదంతా స‌రే.. ఆలియాకు ఉన్న క్రేజు దృష్ట్యా యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకునేందుకు త‌నతో భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి టెక్స్‌టైల్స్ కంపెనీలు. ప‌లు ర‌కాల స‌మ్మ‌ర్ క‌లెక్ష‌న్స్‌, డిజైన్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ ఫ్యాష‌న్ ప్ర‌పంచానికి చెందిన భారీ ఆఫ‌ర్ల‌ను ఆలియాకు క‌ట్ట‌బెడుతున్నాయి. ఇప్ప‌టికే మాల్స్‌లో ఆలియా ఫోటో క‌నిపించ‌నిదే బిజినెస్ అన్న‌దే లేదు. ఇలా బ్రాండ్ల రూపంలోనే ఆలియా కోట్ల‌కు కోట్లు ఆర్జిస్తోంద‌న్న రిపోర్ట్ ఉంది. తాజాగా రిలీజ్ చేసిన వాణిజ్య ప్ర‌క‌ట‌న విజువ‌ల్ గ్లింప్స్ చూడ‌గానే క‌ట్టిప‌డేస్తోంది. ఆలియా స్ట‌న్నింగ్ విజువ‌ల్ అప్పియ‌రెన్స్ మ‌తిచెడ‌గొడుతోంది అంటే అతిశ‌యోక్తి కానేకాదు. డౌట్ ఉంటే మీరే చూడండి ఈ వీడియో…

🎒

A post shared by Alia ✨⭐️ (@aliaabhatt) on

  •  
  •  
  •  
  •  

Comments