తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…ప్రవేశ పరీక్షల వాయిదా!

Tuesday, June 30th, 2020, 07:20:05 PM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటికే టెన్త్ పరీక్షలు నిర్వహించకుండా నే అందరినీ పాస్ చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు జరగాల్సి ఉండగా, నిన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజు ముందు సస్పెన్స్ వీడింది.

మే నెలలో జరగాల్సిన పరీక్షలు సైతం రాష్ట్ర ప్రభుత్వం జూలై లో నిర్వహిస్తాం అని తెలిపింది. అయితే పాలి సెట్ పరీక్ష తో పాటుగా, ఈ సెట్, ఎంసెట్, లా సెట్, ఐ సెట్ ఇంకా ఎడ్ సెట్ ల పరీక్షలు వాయిదా వేయడం జరిగింది.ఇప్పటికే పరీక్షలను రద్దు చేయాలని స్టూడెంట్ యూనియన్ కి చెందిన వారు కోర్టు లో పిటిషన్ వేయగా, రాష్ట్ర ప్రభుత్వం రద్దు కి నిరాకరించదం జరిగింది. పరీక్షలను వాయిదా వేస్తూ ముందుకు రావడం తో కోర్టు కి తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో రేపటి నుండి జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇంకా ఎన్ని వాయిదా పడతాయో చూడాలి.