అమ్మ కాఫీతో అన్ని భయాలు పోయాయి : సూపర్ స్టార్ మహేష్

Tuesday, April 24th, 2018, 02:29:08 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు గత రెండు సంవత్సరాలుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. నిజానికి ఆయనకీ వున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప తరగదు. కానీ ఫాన్స్ కి మాత్రం సరైన విజయాన్ని ఇవ్వలేకపోతున్న అనే లోటు ఆయనని వెంటాడుతోంది. కానీ చివరకు ఇన్నాళ్లకు భరత్ అనే నేను రూపం లో అది నెరవేరింది. అయితే ఈ అతి పెద్ద విజయానికి ముఖ్య కారకులు కొరటాల శివ అని చెప్పారు నిన్న జరిగిన విజయోత్సవ ప్రెస్ మీట్ లో మహేష్ బాబు. అలానే ఈ సినిమా విడుదలకు ముందు తాను చాలా టెన్షన్ పడ్డానని,

అందుకే విడుదలకు ముందుగానే ఫామిలీ తో సహా విదేశాలకు ట్రిప్ వెళ్లి వచ్చాను అన్నారు. కానీ విడుదల దగ్గరపడేకొద్దీ భయం అంతకంతకు పెరిగిందన్నారు. కాగా ఈనెల 17న ఆ భయం మరింత పెరిగి, చివరకు గ్లాస్ పట్టుకున్న చేతులు వణికేవని అన్నారు. అతిహే ఆరోజు వాళ్ళ అమ్మగారు ఇందిరమ్మ గారి చేతులమీదుగా తగిన ఒక కాఫీ తో మొత్తం భయాలన్నీ మటుమాయం అయ్యాయని, అమ్మ చేతి కాఫీ లో వున్నా మాధుర్యం అటువంటిదని సూపర్ స్టార్ చెప్పుకొచ్చారు. కాగా భరత్ అనే నేను మాత్రం ప్రస్తుతం స్ట్రాంగ్ కలెక్షన్లతో అన్ని ఏరియాల్లో దూసుకుపోతుంది……

  •  
  •  
  •  
  •  

Comments