హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు సర్వం సిద్దం..!

Monday, October 21st, 2019, 12:00:12 AM IST

హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచాడు. అయితే ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందడంతో హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి సోమవారం నాడు ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ పద్మావతి, అధికార పార్టీ నుంచి సైది రెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావ కిరణ్మయి, స్వతంత్రులుగా తీన్మార్ మల్లన్న వంటి వారు ముఖ్యంగా బరిలో ఉన్నారు.

అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పక్కాగా పూర్తయ్యాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే మొత్తం 2,36,842 మంది ఓటర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఓటింగ్ ప్రక్రియ కోసం మొత్తం 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 1708 ఈవీఎంలను వినియోగించనున్నారు. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ భద్రతను కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఫలితాలు ఈ నెల 24న వెలువడుతాయి.