సంక్రాంతి సినిమాల అస‌లు లెక్క‌లివిగో!

Tuesday, January 23rd, 2018, 12:37:18 PM IST

సంక్రాంతి సినిమాల సంద‌డి ఇక ముగిసిన‌ట్టే. ఈ రిప‌బ్లిక్ డే సాక్షిగా తెలుగులో పెద్దంత క్రేజీ సినిమా ఏదీ రాక‌పోయినా.. బాలీవుడ్ నుంచి వ‌స్తున్న `ప‌ద్మావ‌త్‌`పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌ద్మావ‌త్ వ‌సూళ్ల హ‌వా సాగిస్తుంద‌న్న అంచ‌నాలున్నాయి. ఇక తెలుగు వెర్ష‌న్ కూడా రిలీజ‌వుతోంది కాబ‌ట్టి ఈ సినిమాపై మ‌న ప్ర‌జ‌లు ముక్కువ చూపించేందుకు ఆస్కారం ఉంది. బాహుబ‌లి ప్ర‌భావం ఈ సినిమాకి పెద్ద ప్ల‌స్ కానుంది. ఈ నేప‌థ్యంలో అస‌లు సంక్రాంతి రిలీజ్‌లు సాధించిన ఘ‌న‌త ఎంత‌? అన్న‌ది ప‌రిశీలిస్తే ట్రేడ్ రిపోర్ట్స్ అందించిన వివ‌రాల ప్ర‌కారం..

ప‌వ‌న్ `ఆజ్ఞాత‌వాసి` 10రోజుల్లో 60 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. 90 కోట్ల మేర గ్రాస్‌ వ‌సూళ్లు ద‌క్కించుకుంది. అయితే ఈ సినిమా 130 కోట్లు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది కాబ‌ట్టి తీవ్ర న‌ష్టాలు త‌ప్ప‌లేదు. బాల‌య్య `జై సింహా` -25కోట్ల షేర్ వ‌సూలు చేసింది. అంటే సుమారు 40 కోట్ల మేర గ్రాస్ వ‌సూళ్లు ఉంటాయ‌నేది ట్రేడ్ అంచ‌నా. సూర్య `గ్యాంగ్` – 7కోట్ల షేర్ (15కోట్ల గ్రాస్‌) చేసి చివ‌రికి కోటి వ‌ర‌కూ న‌ష్టం మిగిల్చింద‌ని ట్రేడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక రాజ్‌త‌రుణ్ న‌టించిన `రంగుల‌రాట్నం` బాక్సాఫీస్ గురించి అస‌లు వెబ్‌లో ఎలాంటి స‌మాచారం దొర‌క‌డం లేదు.. అంటేనే ఆ సినిమా ఫ‌లితం ఎలా తేలిందో అర్థం చేసుకోవ‌చ్చు. మొత్తానికి సంక్రాంతి అలా ముగిసింది. ఇక ప‌ద్మావ‌త్ హ‌వా ఏ రేంజులో ఉంటుందో చూడాలి.