మొదటి రోజు భారీ రికార్డు నమోదు చేయనున్న “అరవింద సమేత”

Saturday, October 6th, 2018, 12:33:38 PM IST

మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్,అందాల నటి పూజ హెగ్డే హీరో,హీరోయిన్లుగా తన మార్క్ పంచ్ డైలాగులతో చప్పట్లు కొట్టించే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అరవింద సమేత వీర రాఘవ”.భారీ అంచనాల నడుమ ఈ దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ చిత్రం ప్రకటించినప్పుడు నుంచి ఈ చిత్రానికి సంబందించిన ప్రతీ విషయము సంచలనమే,త్రివిక్రమ్ ఎప్పుడు టచ్ చేయని మాస్ కథనం,దానికి తోడు రాయలసీమ నేపధ్యం,అందులోను తారక్,త్రివిక్రమ్ ల కంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ చిత్రం పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

ఇప్పటికే విడుదలైన టీజర్లు,పాటలు,పోస్టర్లు,ట్రైలర్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది.దీనితో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.ఇప్పటికే మొదటి రోజు కలెక్షన్లు ఎవ్వరు ఊహించని రీతిలో వస్తాయని,విడుదల కాబోతున్న ప్రతీ చోట మొదటి రోజు కలెక్షన్ కు అంతా సిద్ధం అయ్యిపోయిందని వార్తలొస్తున్నాయి.

ఇప్పుడొస్తున్న వార్తల ప్రకారం విడుదల కాబోతున్న ప్రాంతాల్లో అన్ని బాగా గుర్తింపు ఉన్న డిస్ట్రిబ్యూటర్లే తీస్కొని మొదటి రోజుకి షోలు అన్ని ఫిక్స్ చేసేశారని తెలుస్తుంది,విడుదల కాబోతున్న ముఖ్య ప్రదేశాల జాబితా వరుసగా చూసుకుంటే “నైజాంలో-శ్రీ వెంకటేశ్వర,కృష్ణ జిల్లాలో-వారాహి,ఉత్తరాంధ్ర-ఏవీ సినిమాస్,నెల్లూరు-అంజలి ఫిలిమ్స్,కర్ణాటకాలో-బృంద మరియు ఓవర్సీస్ లో వైనవి హన్వి(ఎల్ ఏ తెలుగు)” వారు భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.దీన్ని బట్టి తారక్ సరి కొత్త రికార్డు లెక్కలను నమోదు చేస్తాడని సినీ విశ్లేషకులు బలంగా చెప్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.