ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన అమీర్ ‘పీకే’

Friday, January 2nd, 2015, 10:23:18 PM IST

pk
మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాడు. మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ‘పీకే’ సినిమాతో కళ్ళు చెదిరే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. బాలీవుడ్ చరిత్రను తిరగరాసేందుకు గ్రహాంతరజీవి ‘పీకే’ అవతారంలో వచ్చి సంచలనం సృష్టిస్తున్నాడు. అమీర్-అనుష్కశర్మ జంటగా నటించిన ఏక్ థా టైగర్ విడుదల రోజు నుంచి రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది.

తొలి 13 రోజుల్లోనే ‘పీకే’ మొత్తం కలెక్షన్ 263 కోట్ల రూపాయలని తేలింది. తొలి 13 రోజులకు గాను ఇది ఆల్ టైం రికార్డ్ గా బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఇంతకు ముందు ధూమ్-3 (261 కోట్లు) పేరిట ఈ రికార్డ్ వుండేది. ఇప్పుడు పీకే ఆ రికార్డ్ ను బద్దలుకొట్టింది. మరో రెండు రోజుల్లోనే పీకే 300 కోట్లు మార్క్ క్రాస్ చేస్తొందని అంచనాలు వేస్తున్నారు. సమీపంలో పెద్ద సినిమాలేం లేకపోవడం ఈ సినిమాకి మరింతగా కలిసొచ్చే అంశం. ఇదే హావా మరికొన్ని రోజులు కొనసాగితే పీకే అల్ టైం రికార్డ్ ఖాయం. కొందరు బాలీవుడ్ విశ్లేషకులు భావిస్తున్నట్టు ‘పీకే’ ఆరు వందల కోట్ల కలెక్షన్లు సాధిస్తుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. సినిమాపై ఓ వైపు వివాదాలు చుట్టిముట్టినా కలెక్షన్లకు మాత్రం ఇబ్బంది లేదు.