చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, August 21st, 2019, 10:50:54 PM IST

ఏపీలో ఈ ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులలోనే టీడీపీ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. అయితే అటు వైసీపీ నేతలు కూడా టీడీపీ విమర్శలకు గట్టిగానే బదులిస్తున్నారు.

అయితే తాజాగా ఏపీలో రాజధాని విషయం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. రాజధానిని అమరావతి నుంచి మార్చుతున్నారన్న వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. అయితే దీనిపై కొందరు వైసీపీ నేతలు మాట్లాడిన తీరు చూస్తుంటే రాజధానిని నిజంగా మార్చుతున్నారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణా రెడ్డి రాజధాని విషయంలో చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్ అయిన రాజధానిని టీడీపీ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుందని బినామీలతో కలిసి చంద్రబాబు గారు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని అన్నారు. అంతేకాదు బెదిరింపులతో నిరుపేదల నుండి రాజధాని భూములను కారుచవకగా లాక్కున్నారని, ప్రజల భాగస్వామ్యం లేకుండా రాజధానిని ప్రకటించుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.