అల్లరోడి ఆశలన్నీ… ఆయాపైనే ?

Friday, October 20th, 2017, 03:44:25 PM IST

అల్లరి నరేష్ కెరీర్ ఈ మధ్య సరిగ్గా సాగడం లేదు .. వరుస పరాజయాలతో నరేష్ ఇంకా కోలుకోలేకపోతున్నాడు. తాజాగా ఎన్నో ఆశలు పెట్టుకున్న మెడమీద అబ్బాయి సినిమా భారీ ప్లాప్ ను మూటకట్టుకోవడంతో నరేష్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మంచి విజయం కోసం ఆరాటపడుతున్న నరేష్ .. నెక్స్ట్ సినిమాకోసం సన్నాహాలు మొదలు పెట్టాడు. ఈ సారి అయన సినిమా చేసేది ఎవరితోనో కాదు . అయన బాబాయ్ అయినా ఈ సత్తిబాబు తోనే? యముడికి మొగుడు, బెట్టింగ్ బంగార్రాజు, వంటి సినిమాలు నరేష్ తో చేసాడు సత్తిబాబు. ఆ సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు .. అయినా సరే మరోసారి సత్తిబాబు తోనే ప్లాన్ చేసాడు నరేష్. ఈ సినిమాకు నిర్మాతలు కూడా ఓకే అయ్యారు. ప్రస్తుతం మంచు విష్ణు తో ఓటర్ సినిమా తీస్తున్నారు. సో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. మరి నరేష్ పెట్టుకున్న నమ్మకాన్ని సత్తిబాటు నిలబెడతాడా లేదా చూడాలి.