సీక్వెల్ తో పాటు మరో ప్రయోగానికి సిద్దమైన అల్లరోడు !

Monday, January 29th, 2018, 04:00:25 PM IST

కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ గత కొంత కాలంగా విజయం కోసం చాలా పరితపిస్తున్నాడు. చివరగా సుడిగాడు సినిమాతో అల్లరోడు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత కొన్ని సినిమాలతో పరవాలేదు అనిపించినా సుడిగాడు రికార్డులను బ్రేక్ చేయలేకపోయాడు. ఇక మళ్లీ అలాంటి కథతోనే హిట్ కొట్టాలని భీమనేని శ్రీనివాస్ తో మళ్లీ సుడిగాడు సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే ఈ కామెడీ హీరో మరో ప్రయోగాత్మకైనా కథకు కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గిరి రీసెంట్ గా నరేష్ కి చెప్పిన ఒక డిఫెరెంట్ కథ బాగా నచ్చేసిందట. దీంతో సుడిగాడు సినిమాతో పాటు ఆ సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో ఆ సినిమా తెరకెక్కనుందని సమాచారం.