నరేష్ కోసం రెండో సుడిగాడ్ని దించుతున్నారు ?

Sunday, January 21st, 2018, 12:42:46 PM IST

పాపం ఈ మధ్య అల్లరి నరేష్ పరిస్థితి ఏమి బాగుండడం లేదు. ఆ మధ్య వచ్చిన సూదిగాడు సినిమా తరువాత నరేష్ చేసిన సినిమా ఒక్కటి సరైన సక్సెస్ అందుకోలేదు. ఇప్పటికే దాదాపు పది సినిమాలదాకా చేసిన నరేష్ ని ఏ ఒక్క సినిమా సరైన సక్సెస్ ఇచ్చి కాపాడలేడు .. దాంతో కెరీర్ అయోమయంలో పడింది నరేష్ కి. ఈ సారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో అయన మళ్ళీ సుడిగాడ్ని దించుతున్నాడు. తనకు కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచినా సుడిగాడు చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో సునీల్ కూడా నటిస్తున్నాడు. ఈ నెల 27న సినిమా మొదలు కానుంది. ఆ రోజు నుండే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెడతారట. మొత్తానికి నరేష్ కి సరైన సక్సెస్ అందించేందుకు రెండో సుడిగాడ్ని దింపుతున్నారు .. మరి ఇప్పుడైనా నరేష్ కోరుకున్న విజయం దక్కుతుందో లేదో చూడాలి.