మహర్షి కథపై నరేష్ క్లారిటీ ఇచ్చేసినట్టున్నడే!

Thursday, August 9th, 2018, 05:36:11 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనుకున్నట్టుగానే తన 25వ సినిమా మొదటి లుక్ తో ఆకట్టుకున్నాడు. మహర్షి అనే పేరుతో ప్రేక్షకులకు సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు. అయితే సినిమాలో అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆ పాత్ర చాలా కీలకమని నరేష్ ను తీసుకున్నారు. ఇంతకుముందు గమ్యం – శంభో శివ శంభో లాంటి సినిమాల్లో నరేష్ చేసిన పాత్రలకు ఆడియెన్స్ నుంచి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.

ఇకపోతే మహర్షి సినిమాలో నరేష్ మహేష్ కు స్నేహితుడిగా నటించనున్నట్లు అనేక రకాల రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు మహేష్ పుట్టినరోజు సందర్బంగా నరేష్ సూపర్ స్టార్ కు స్పెషల్ గా విషెస్ చెబుతూ ఒక క్లారిటీ ఇచ్చాడు. రిషి అనే పాత్రలో మహేష్ కనిపించనున్నాడు. కథలో రిషి తన స్నేహితుడి కోసం అమెరికా నుంచి ఇండియాకి వస్తాడని ప్రచారం సాగుతోంది. ఆ స్నేహితుడే రవి (అల్లరి నరేష్). రవి టూ రిషి అని నరేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఆ రూమర్ నిజమే అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాలో వీరి స్నేహం ఎంతవరకు మెప్పిస్తుందో తెలియాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments