ట్రెండీ టాక్‌ : అల్లూ వారి గ్రాండ్ పార్టీ!

Monday, May 14th, 2018, 11:49:28 AM IST

‘మ‌హాన‌టి’ స‌క్సెస్‌పై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తమ‌వుతోంది. ఓ మంచి ప్ర‌య‌త్నానికి ద‌క్కిన గుర్తింపుగా, ఒక గొప్ప న‌టికి ద‌క్కిన గౌర‌వంగా దీనిని భావిస్తున్నారు. జీవిత‌క‌థ‌ల్ని స‌హ‌జసిద్ధంగా చూపించినా, అందులో ఎమోష‌న్ క్యారీ అయితే విజ‌యం ఖాతాలో ప‌డుతుంద‌ని మ‌హాన‌టి నిరూపించింది. సేమ్ టైమ్ ఎలాంటి ఎమోష‌న్ పండ‌కుండా, అన్ని క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల్ని చూపించినా స‌క్సెస్ ద‌క్క‌ద‌ని, భారీత‌నం వ‌ల్ల ఏ ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని `నా పేరు సూర్య‌` బాక్సాఫీస్ ఫ‌లితం చెబుతోంది.

ఏదేమైనా.. త‌మ సినిమా ఫ్లాపైనా, ఓ మంచి సినిమా ఆడినందుకు అల్లు కాంపౌండ్ సెల‌బ్రేష‌న్స్ చేయ‌డం స‌ర్వత్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. ఈ ఆదివారం సాయంత్రం మ‌హాన‌టి టీమ్‌కి, ద‌త్‌కి అదిరిపోయే పార్టీ ఇచ్చారు బాస్ అల్లు అర‌వింద్‌. ఈ సంద‌ర్భంగా బ‌న్ని సామాజిక మాధ్య‌మంలో ఆ పార్టీ ఫోటోని పోస్ట్ చేసి ఆస‌క్తిక‌ర కామెంట్‌ని పెట్టారు. “మ‌హాన‌టి` స‌క్సెస్‌ సంద‌ర్భంగా నాన్న గారు… త‌న ఫ్రెండు కం పార్ట‌న‌ర్‌ అశ్వ‌నిద‌త్‌గారికి అద్భుత‌మైన పార్టీ ఇచ్చారు. మ‌హాన‌టి టీమ్‌కి, కెప్టెన్‌ నాగ్ అశ్విన్‌కి హ్యాట్సాఫ్‌“ అని కామెంట్‌ని పోస్ట్ చేశారు. ఈ పార్టీలో రాజ‌మౌళి, కీర‌వాణి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ద‌త్ & మ‌హాన‌టి టీమ్ డిన్న‌ర్ పార్టీని ఆస్వాధించారు.

  •  
  •  
  •  
  •  

Comments