త్రీడి వెర్షన్ లో అల్లు అరవింద్ సంపూర్ణ రామాయణం ?

Sunday, March 18th, 2018, 04:24:22 PM IST

దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణం సినిమా నిర్మించే సన్నాహాలు చేస్తున్నారు తెలుగు నిర్మాత అల్లు అరవింద్. గీత ఆర్ట్స్ తో పాటు మరో రెండు పెద్ద బ్యానర్స్ కలిపి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా 3 డి వెర్షన్ లో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కే ఈ సినిమాకు సంపూర్ణ రామాయణం అనే టైటిల్ పెడుతున్నట్టు తెలిసింది. ఎందుకంటే తాజాగా ఈ టైటిల్ ని ఛాంబర్ లో రిజిస్టర్ చేయడంతో ఇదే టైటిల్ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అల్లు అరవింద్ తో పాటు నమిత్ మల్హోత్రా, మధు మంతెన లు నిర్మిస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రాజెక్టు ని అనౌన్స్ చేస్తారట.