500 కోట్లతో అల్లు వారి రామాయణం ?

Friday, February 23rd, 2018, 10:32:17 PM IST


మొత్తానికి అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించే రామాయణం సినిమా సెట్స్ పైకి తెచ్చే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆ మద్యే ఈ సినిమాకు సంబందించిన చర్చలు జరిగాయి .. అయితే ఆ తరువాత ఈ సినిమా గురించి ఎక్కడ వినిపించక పోవడంతో సినిమా ప్రయత్నం ఆగిపోయిందని అనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి లక్నో లో జరిగిన ఓ సమ్మిట్ లో ఒప్పందం చేసుకోవడంతో సినిమా పై నిర్మాతలు చాలా సీరియస్ గా ఉన్నట్టు స్పష్టం అవుతుంది. రాముడు పుట్టిన ప్రాంతం అయినా ఉత్తర ప్రదేశ్ లోనే ఈ సినిమాను తెరకెక్కిస్తారట. అందుకోసం యుపి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వడానికి రెడీ అయింది. ఈ సినిమాను నిర్మిస్తున్న మరో నిర్మాత మధు మంతెన ఈ సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కనుందని తెలిపారు. ఇండియాలోనే అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.