విక్ర‌మ్‌.కె మూవీ ఇంకా హోల్డ్‌లోనే?

Saturday, September 22nd, 2018, 03:22:55 AM IST

బ‌న్ని న‌టించిన `నా పేరు సూర్య‌` డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ అల్లు కాంపౌండ్‌ని క‌ల‌వ‌ర‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ ప‌రాజ‌యం బ‌న్నిని పూర్తిగా డైలెమాలో ప‌డేసింది. అందుకే ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఈసారి అత‌డు ఎంచుకునే స్క్రిప్టు విష‌య‌మై ఎంతో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నాడు. ఆ క్ర‌మంలోనే విక్ర‌మ్‌.కె.కుమార్ వినిపించిన స్క్రిప్టు విష‌యంలో పూర్తిగా సంతృప్తి చెంద‌డం లేదు. ఏడాది కాలంగా ఆ ఇద్ద‌రూ క‌లిసే ట్రావెల్ అవుతున్నా.. స్క్రిప్టు మాత్రం ఫైన‌ల్ అవ్వ‌డం లేదు.

ఇప్ప‌టికీ ఈ ప్రాజెక్ట్ స‌స్పెన్స్‌లోనే ఉంద‌న్న మాటా వినిపిస్తోంది. విక్ర‌మ్‌.కె సాఫ్ట్ కైండ్ నేరేష‌న్ కొన్ని చిక్కులు తెచ్చి పెడుతోంది. బోయ‌పాటి త‌ర‌హాలో మాస్ ఎలిమెంట్స్‌తో మ‌సాలా ద‌ట్టించ‌డంలో అత‌డు ప‌రిణ‌తి చూపించ‌డం లేదుట‌. అందుకే ఆ స్క్రిప్టులో మ‌సాలా ఎలిమెంట్స్ జోడించాల‌ని ప‌దే ప‌దే బ‌న్ని అత‌డికి చెబుతున్నాడు. అయినా విక్ర‌మ్‌.కె కావాల్సిన మార్పులు చేయ‌డంలో, స్క్రిప్టును ఫైన‌ల్ చేయించుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాడు. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. విక్ర‌మ్‌.కె సినిమాని బ‌న్ని ఇప్ప‌టికీ పెండింగులోనే పెట్టాడ‌ని మాట్లాడుకుంటున్నారు. మ‌రోవైపు త్రివిక్ర‌మ్ వినిపించబోయే స్క్రిప్టు గురించి బ‌న్ని ఆత్రుత‌గా వేచి చూస్తున్నాడ‌ట‌. ఎన్టీఆర్‌తో `అర‌వింద స‌మేత` పూర్త‌వ్వ‌గానే త్రివిక్ర‌మ్ బ‌న్నికి స్క్రిప్టు వినిపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. అయితే `అజ్ఞాత‌వాసి` లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న అర‌వింద స‌మేత విజ‌యం సాధిస్తేనే ఈ కాంబో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సుంటుంది. అందుకే బ‌న్ని `అర‌వింద స‌మేత` రిజ‌ల్ట్ కోసం ఎంతో క్యూరియ‌స్‌గా ఉన్నార‌ని ప్రచారం సాగుతోంది. అయితే విక్ర‌మ్‌.కె స్క్రిప్టును పూర్తిగా ప‌క్క‌న పెట్టేయ‌లేదు. వ‌చ్చే ఏడాది అత‌డు రీఫ్రెషింగ్ థాట్స్‌తో స్క్రిప్టుని బెస్ట్‌గా తీర్చి దిద్దాక‌ మ‌ళ్లీ క‌లుస్తాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈ ప్రాజెక్టుపై ఇదీ వాస్త‌వం అని గీతా ఆర్ట్స్ కాంపౌండ్ పూర్తి వివ‌రాల్ని వెల్ల‌డించాల్సి ఉందింకా.