బ‌న్ని డ‌బుల్ రోల్‌.. 100కోట్ల బ‌డ్జెట్‌!

Wednesday, July 11th, 2018, 03:05:55 PM IST

అల్లు అర్జున్ న‌టించిన డీజే, స‌రైనోడు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్. ఆ క్ర‌మంలోనే హ్యాట్రిక్ కొట్టాల‌నుకున్న బ‌న్నికి బ్రేక్ ప‌డింది. వ‌క్కంతం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `నా పేరు సూర్య` భారీ అంచ‌నాల న‌డుమ రిలీజై డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ ఫ‌లితంతో షాక్ తిన్న బ‌న్ని ప్ర‌స్తుతం స్క్రిప్టుపై భారీగా క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. మ‌నం, 24 వంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టిన విక్ర‌మ్‌తో ఓ ప్ర‌యోగాత్మ‌క స్క్రిప్టునే రెడీ చేయించాడ‌ని తెలుస్తోంది. ఇందులో తొలిసారి బ‌న్ని ద్విపాత్రాభిన‌యం చేస్తాడ‌ని క్లోజ్ సోర్సెస్ నుంచి స‌మాచారం లీకైంది.

ఈ సెప్టెంబ‌ర్‌లోనే సినిమా ప్రారంభించ‌నున్నారుట‌. ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఇక‌పోతే ఈ చిత్రానికి దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్‌ని ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు విజువ‌ల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌కి అసాధార‌ణ ప్రాధాన్య‌త ఈ స్క్రిప్టులో ఉందిట‌. న‌ల్ల‌మ‌లుపు బుజ్జి- శానం నాగ అశోక్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. జాతీయ‌, అంత‌ర్జాతీయ మార్కెట్ల‌ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. ఇక బ‌న్ని దృష్టి కేవ‌లం ఈ సినిమాపైనే. ఇక వేరే ద‌ర్శ‌కుల‌కు ఇప్ప‌ట్లో ఛాన్స్ లేద‌ని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments