సెన్సేషనల్ వీడియో: బన్నీ చేసిన క్యాప్ ట్రిక్స్ చూడండి ఎంత కష్టపడ్డాడో..!

Thursday, May 3rd, 2018, 09:16:11 PM IST

యంగ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌క్కంతం వంశీ దర్శకత్వంలో తెర‌కెక్కించిన చిత్రం నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. మే 4న విడుద‌ల కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ భలే జోరుగా జ‌రుగుతున్నాయి. చిత్రంలో బ‌న్నీ ఆర్మీ ఒక పవర్ ఫుల్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా, ఈ పాత్ర కోసం చాలా రోజులు కష్టపడి త‌న మేకొవ‌ర్ పూర్తిగా మార్చుకున్నాడు. ఇక ఓ ల‌వ‌ర్ ఆల్సో.. ఫైట‌ర్ ఆల్సో అనే పాటలో క్యాప్ ట్రిక్‌ కోసం బ‌న్నీ ఎంత‌గానో శ్రమించాడ‌ని యూనిట్‌కి చెందిన ప్ర‌తి ఒక్కరు చెప్పుకోవడమే కాకుండా ఆయన అంత శ్రమించి డ్యాన్స్ చేసినందుకు మెచ్చుకుంటూ పొగడ్తల వర్షం కురిపించారు . అయితే ఇదంతా ఇటివల జ‌రిగిన ప్రీ రిలీజ్ వేడుక‌లో వ‌క్కంతం వంశీ బన్నీ కృషిని ఎంతగానో అభినందించాడు. షూటింగ్ అయిపోగానే క్యాప్ ట్రిక్ కోసం బ‌న్నీ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డేవాడు. అది గ్రాఫిక్స్ కాదు. బ‌న్నీ రెండు నెల‌ల క‌ష్టం. ఏడాది స‌మయం ప‌ట్టే ఈ ట్రిక్ బ‌న్నీ రెండు నెల‌లోనే పూర్తి చేసి శభాష్ అనిపించాడు అని వంశీ అన్నారు. తాజాగా బ‌న్నీ క్యాప్ ట్రిక్ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా నటించిన ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్‌, నాగబాబు సంయుక్తంగా నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు.