సరికొత్త రికార్డ్ సృష్టించిన బన్నీ పాట!

Tuesday, May 8th, 2018, 05:20:53 PM IST

ఇండియాలో ఉన్న హీరోల్లో ది బెస్ట్ డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అల్లు అర్జున్ ఉన్నాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టే ఓ సాంగ్ ఉండాల్సిందే. రీసెంట్ గా వచ్చిన నా పేరు సూర్య సినిమాలో కూడా బన్నీ సరికొత్త స్టెప్పులు వేసి ఎంతగానో అలరించాడు. ముఖ్యంగా లవర్‌ ఆల్సో ఫైటర్‌ ఆల్సో పాటలో చేసిన క్యాప్ మూమెంట్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాదాపు రెండు నెలలు కష్టపడి నేర్చుకొని బన్నీ ఆ మూమెంట్స్ చేయడం చిత్ర యూనిట్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపోతే ఆ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. రిలీజ్ కు ముందే యూ ట్యూబ్ లో రిలీజ్ చేసిన ఆ వీడియోను ఇప్పటివరకు 25 లక్షలకు మందికి పైగా వీక్షించడం ఒక రికార్డ్ అని చెప్పాలి. బన్నీకి సరైనోడు సినిమా నుంచి కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఫాలోవర్స్ చాలానే పెరిగారు. దీంతో బన్నీ ప్రతి సినిమాను పరభాషా ప్రేక్షకులు కూడా తెగ ఇష్టపడుతున్నారు.