మరో వివాదంలో ఇరుక్కున్న బన్నీ..!

Wednesday, December 28th, 2016, 07:08:35 PM IST

allu-arjun
తెలుగు చిత్ర సీమలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నటన, నృత్యాలతో తిరుగు లేని విధంగా దూసుకుని పోతున్నాడు. అదేవిధంగా వివాదాలలోనూ ఇరుక్కుంటున్నాడు. ఆమద్యన ‘చెప్పను బ్రదర్’ అన్న వ్యాఖ్య ఎంత దుమారం రేపిందో తెలిసిన విషయమే. బన్నీ చేసిన ఈ వ్యాఖ్య వలన కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో పవన్ అభిమానులు రచ్చ చేసారు. ఆ వివాదం ముగియక ముందే మరో వివాదానికి తెర లేపినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

కాగా మంగళవారం బన్నీ వైజాగ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఓ సిమెంట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన బన్నీ ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు వైజాగ్ వెళ్లాడు. ఈ సందర్భంగా బన్నీ మెగా అభిమానులతో కొంతసేపు ముచ్చటించారు. అభిమానులతో ముచ్చటించే క్రమంలో బన్నీ.. బాలకృష్ణ వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి గురించి పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య, చిరంజీవిల చిత్రాలు ఎప్పుడు విడుదలైనా అభిమానులు వారి మధ్య పోటీగానే భావిస్తారు. ఈ నేపథ్యంలో బన్నీ ఖైదీ నెం 150, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలను ఉద్దేశించి ‘ఈసారి సంక్రాంతి మనదే బ్రదర్’ అని అభిమానులతో అన్నట్లు తెలుస్తోంది. దీనితో నందమూరి అభిమానులు బన్నీ పై ఆగ్రహంగా ఉన్నారట.

  •  
  •  
  •  
  •  

Comments