పవన్ రికార్డులను టార్గెట్ చేస్తున్న బన్నీ ?

Thursday, January 4th, 2018, 09:07:39 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా హీరోల హవా ఓ రేంజ్ లో ఉంది. ఇప్పటికే పవర్ స్టార్ అంటే ఎలాంటి క్రేజ్ ఉందొ అందరికి తెలుసు .. ఆ తరువాత అంతటి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే నటన, డాన్స్ లతో ఇరగదీసే అల్లు అర్జున్ తాజాగా పవన్ కళ్యాణ్ రికార్డును బద్దలు కొట్టాడు. పవర్ స్టార్ నటించిన అజ్ఞాతవాసి టీజర్ కేవలం 24 గంటల్లో 64 లక్షల వ్యూస్ సాధించి రికార్డు కొట్టింది. తెలుగులో ఇది రికార్డ్. అయితే ఇండియా వైజ్ గా చూసుకుంటే విజయ్ నటించిన మెర్సల్ సినిమా దే రికార్డ్. కేవలం ఒక్క రోజులో అత్యధిక వ్యూస్ వచ్చిన సినిమా గా సంచలనం రేపింది. ఆ టీజర్ ని 24 గంటల్లో కోటి మంది చూసారు. ఆ తరువాత అజ్ఞాతవాసికే ఆ క్రెడిట్ దక్కింది అనుకుంటే .. మధ్యలోకి సూర్య ఎంట్రీ ఇచ్చేసాడు. అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా టీజర్ నిన్న విడుదలై ఒక్క రోజులు దుమ్ము రేపి ఏకంగా 68 లక్షల వ్యూస్ సాధించింది. అంటే అజ్ఞాతవాసి రికార్డును దాటేసింది. ఇక 29 గంటల్లోనే కోటి వ్యూస్ దక్కిన టీజర్ గా రికార్డుకెక్కింది. ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ నటించిన కాటమ రాయుడు సినిమా టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తే … దాన్ని మించి అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాధం రికార్డు బద్దలు కొట్టింది. మొత్తానికి అల్లు అర్జున్ సైలెంట్ గా పవన్ రికార్డులకు ఎసరు పెడుతున్నాడు.