బన్ని ప‌రువు తీస్తున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌?

Friday, February 24th, 2017, 08:56:54 PM IST


లైక్‌లు కొట్టి ఎంకరేజ్ చేయ‌డ‌మే కాదు, డిజ్‌లైక్స్ కొట్టి మూడాఫ్ చేయ‌డం కూడా ఫ్యాన్స్‌కు తెలుసు. ఆ సంగ‌తి డీజే టీజ‌ర్‌తో బ‌య‌ట‌ప‌డింది. పాపం బ‌న్ని ఇదేం వ్య‌తిరేక‌త దేవుడా? అనుకునే రేంజులో ఉందీ వ్య‌వ‌హారం. ఏదేమైనా బ‌న్ని ప‌రువు పోయింది. ఫ్యాన్స్ ప‌నిగ‌ట్టుకుని ప‌రువు తీశారు. ఎవ‌రి ఫ్యాన్స్ ప‌రువు తీశార‌న్న‌ది కాదు, తీశారా లేదా? అన్న‌దే ముఖ్యం. డీజే టీజ‌ర్‌కు తొలి గంట‌, తొలి ఐదు గంట‌లు లైక్స్‌, డిస్‌లైక్స్‌ ప‌రిశీలిస్తే గంట‌గంట‌కు చెత్త రికార్డు న‌మోదైంది. మొద‌టి గంట‌లోనే 10వేల డిస్‌లైక్స్ వ‌చ్చాయి. ఐదుగంట‌ల్లో 27వేల డిస్‌లైక్స్ వస్తే, 40వేల లైక్స్ వ‌చ్చాయి. టోట‌ల్ 2లక్ష‌ల‌ వ్యూస్‌లో ఇన్ని డిస్‌లైక్స్ రావ‌డం అన్న‌ది ఇదివ‌ర‌కూ ఏ హీరోకీ లేదు. బ‌న్నికి మాత్రం ఇంకా ఇంకా డిస్‌లైక్స్ ప‌డిపోతున్నాయ్‌. అయితే దీని వెన‌క బ‌న్ని వ్య‌తిరేకులైన ప‌వ‌న్ ఫ్యాన్స్ ఉన్నార‌న్న‌ది కొంద‌రి వాద‌న‌. అయితే ప‌వ‌న్ ఫ్యాన్స్ అలాంటివాళ్లు కాదు. కావాల‌ని అలా చేయ‌రు. ఇది ఎవ‌రో ప‌నిగ‌ట్టుకుని చేస్తున్న ప్ర‌చారం అంటూ చెప్పుకోవ‌డం విశేషం.