షాక్ .. బాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్న అల్లు అర్జున్ ?

Tuesday, September 26th, 2017, 05:45:32 PM IST


ప్రస్తుతం నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ అంటే టాలీవుడ్ తో పాటు అటు మలయాళంలో మంచి క్రేజ్ ఉంది .. తాజాగా బన్నీ ఫోకస్ ఇప్పుడు బాలీవుడ్ పై పడిందట !! దానికి కారణం .. నా పేరు సూర్య సినిమానే .. ఎందుకంటే ఈ కథ అన్ని బాషల వారికి సరిపోయే కథ కాబట్టి .. దీన్ని హిందీలో కూడా ఒకేసారి విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట ? హీరోగా తన స్టామినా పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు, మరో వైపు బన్నీ సినిమాలు హిందిలో డబ్బింగ్ అయి మంచి క్రేజ్ తెచ్చుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. బన్నీ తాజా సినిమా సరైనోడు .. హిందీ డబ్బింగ్ హక్కులు ఏకంగా 10 కోట్లకు అమ్ముడయ్యాయి. నా పేరు సూర్య సినిమాను కూడా సైమంటెన్స్ గా భారీగా విడుదల చేయాలనీ నిర్మాతలకు సూచించాడట !! ఈ సినిమా అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంటే .. నెక్స్ట్ హిందీలో నేరుగా ఓ సినిమాతో ఎంట్రీ ఇవ్వాలని బన్నీ ప్లాన్ !! మరి నా పేరు సూర్య సినిమా అనుకున్నట్టుగా మంచి రిజల్ట్ వచ్చిందంటే .. అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయం !! ఏమంటారు.

Comments