ఆ విషయంలో… చిరు తరువాత అతడే !!

Monday, November 14th, 2016, 10:56:30 AM IST

chiru-allu-arjun
టాలీవుడ్ లో మెగాస్టార్ క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలుసు. మెగాస్టార్ చిరంజీవి చెయ్యని పాత్ర దాదాపు లేదనే చెప్పాలి. ప్రయోగాత్మక పాత్రల గురించి కాకుండా కమర్షియల్ పాత్రల సినిమాల గురించే ఇక్కడ మాట్లాడుకుందాం. చిరంజీవి వేసిన పాత్రలు అటు మాస్ ప్రేక్షకులని, ఇటు క్లాస్ ప్రేక్షకులని మెప్పించాయి. ఇక చిరంజీవి తరువాత ఆయన దారిలో ఫాలో అవుతున్నాడు అల్లు అర్జున్ ? మెగాస్టార్ చిరంజీవి లా కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న బన్నీ .. ఓ రకంగా చిరంజీవి మాస్ ఇమేజ్ కోసం ఎలాంటి పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు అన్న విషయంలో ఆయన్ను నిజంగానే ఫాలో అవుతున్నాడు. గతంలో చిరంజీవి ”ముగ్గురు మొనగాళ్లు” చిత్రంలో మూడు పాత్రలు చేసి అలరించాడు. అందులో ఒకటి బ్రాహ్మణుడి పాత్ర. ఇప్పుడు అచ్చంగా అలాంటి పాత్రలో కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. అయన హీరోగా నటిస్తున్న ”దువ్వాడ జగన్నాధం” డీజే చిత్రంలో బ్రాహ్మణుడి పాత్రలో కనిపిస్తాడట, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైద్రాబాద్ ఓల్డ్ సిటీ లో జరుగుతుంది. బ్రాహ్మణుడి గెటప్ లో బన్నీ ని చుసిన ఫాన్స్ షాక్ అయ్యారట !!