హరీష్ శంకర్ మీద కోప్పడిన అల్లూ అర్జున్

Thursday, February 9th, 2017, 10:40:01 AM IST


డీజే – దువ్వాడ జగన్నాథం .. ఈ సినిమా కోసం అల్లూ అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అప్డేట్ లు చాలా తక్కువగా వస్తున్నాయి. కానీ షూటింగ్ మాత్రం శరవేగంగా సాగుతూ అప్పుడే దాదాపు ఎనభై శాతం మేరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్ సమ్మర్ విడుదల ని టార్గెట్ చేసాడు. సరైనోడు తరవాత అల్లూ అర్జున్ నుంచి వస్తున్న సినిమా ఇదే అవ్వడం తో మార్కెట్ లో నే కాక డిస్ట్రిబ్యూటర్ లు కూడా ఈ సినిమాకి సంబందించిన ప్రతీ అంశాన్నీ సీరియస్ గా చూస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా ఫస్ట్ లుక్ రాలేదు కానీ టీజర్ మాత్రం కట్ చేసేసాడు హరీష్. ఈ టీజర్ ని చూసిన అల్లూ అర్జున్ హరీష్ మీదా అతని బృందం మీదా కోప్పడ్డాడు అని గుసగుసలు వినపడుతున్నాయి. ఫిలిం నగర్ వర్గాల భోగట్టా ప్రకారం టీజర్ అర్జున్ కి అసలు నచ్చేదట. పైగా ఈ మూవీలో పక్కా బ్రాహ్మిన్ అయిన అదుర్స్ చారి టైపు రోల్ విషయంలో బన్నీ చాలా పట్టుదలగా ఉన్నాడని అంటున్నారు. అందుకనే.. హరీష్ శంకర్ చూపించిన టీజర్ కు మరిన్ని మార్పు చేర్పులు సూచించాడట స్టైలిష్ స్టార్.