డైలమాలో అల్లు అర్జున్?

Monday, May 21st, 2018, 12:40:40 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలి చిత్రం నా పేరు సూర్య చిత్రం పరాజయంతో డైలమా లో పడ్డట్లు టాలీవుడ్ సినీ వర్గాలు అంటున్నాయి. ఎన్నో ఆశలతో వక్కంతం వంశి తెరకెక్కించిన ఈ చిత్రం తొలిరోజు నుండే నెగటివ్ టాక్ ను మూటగట్టుకుంది. ఇంతకముందు చేసిన సరైనోడు మంచి విజయం అందుకుంది, ఇక ఆ తరువాత చేసిన డీజే కూడా పర్వాలేదనిపించింది. వరుసగా రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో ఆయన తన తదుపరి చిత్రాన్ని ఆచి తూచి ఆలోచించి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓవైపు బన్నీ విక్రమ్ కుమార్ సినిమాకి పచ్చ జెండా ఊపారని, త్వరలోనే ఈ చిత్రం అంనౌన్సుమెంట్ కూడా ఉంటుందని కొందరు అంటున్నారు. మరోవైపు ఆయన కొరటాల తో చిత్రం చేస్తారని వార్తలు వస్తున్నాయి. కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క అపజయమైనా ఎరుగని కొరటాల అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా తీయగలరని ఆయన ఆలోచిస్తున్నారట. కొరటాల కూడా ప్రస్తుతం భరత్ అనే నేను విజయం తరువాత తన తదుపరి చిత్రాన్ని ఆయన ప్రకటించలేదు కూడా.

అలానే త్రివిక్రమ్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ, అయన ప్రస్తుతం ఎన్టీఆర్ తో అరవింద సామెత చిత్రతో బిజీగా వున్నారు. దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని ఆ చిత్ర యూనిట్ భావిస్తుండడంతో అప్పటివరకు ఆయనకూడా ఖాళీగా ఉండరని తెలుస్తోంది. ఇక వంశి వంటి నూతన దర్శకుడికి అవకాశం ఇస్తారా అనే మాట వినిపిస్తున్నా, నా పేరు సూర్య ఫలితంతో ఆ అవకాశం కూడా కనపడడంలేదు. కాగా ప్రస్తుతం బన్నీ కెరీర్ లో ఎప్పుడూ లేనంత ఆలోచనలో పడ్డారని, తన తన తదుపరి చిత్రాన్ని ఎవరితో అనౌన్స్ చేస్తారనేది కొద్దిరోజులు పాటు ఆగితే గాని తెలిసేలా లేదు…..

  •  
  •  
  •  
  •  

Comments