ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి తో గోన గన్నా రెడ్డి..?

Monday, September 10th, 2018, 07:38:56 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన తనయుడు రాం చరణ్ నిర్మాతగా స్టైలిష్ చిత్రాల స్పెషలిస్ట్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో అతంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం “సైరా నరసింహా రెడ్డి” మనకి తెలిసిన ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధుల కన్నా ముందే తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించిన మొట్టమొదటి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్రకి ప్రతీకే ఈ చిత్రం.

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక కొత్త వార్త నెట్టింట్లో హుల్ చల్ చేస్తుంది. తెలిసిన వార్త ప్రకారం ఈ చిత్రం లో స్టైలిష్ స్టార్ “అల్లు అర్జున్” ఒక అతిధి పాత్ర చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు అన్ని సినీ పరిశ్రమల నుంచి ఈ చిత్రంలో నటిస్తున్నారు ఇప్పుడు అదనపు హంగుగా అల్లు అర్జున్ చేరి మరింత బూస్ట్ ఇచ్చాడు అని తెలుస్తుంది. అయితే ఈ చిత్రం లో అల్లు అర్జున్ ఏ పాత్ర చేస్తున్నారో అన్న దాని కోసం ఇంకా వెల్లడి కాలేదు. ఈ చిత్రం 2019 వేసవి కానుకగా తీసుకువస్తాం అన్నట్టుగా నిర్మాత రామ్ చరణ్ ప్రకటించారు.

  •  
  •  
  •  
  •  

Comments