బన్నీ లైనప్ అదిరింది

Tuesday, January 24th, 2017, 02:28:30 PM IST

allu-arjun
పోయిన సంవత్సరం సరైనోడు తో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లూ అర్జున్ ఇప్పుడు దువ్వాడ జగన్నాథం సినిమాలో నటిస్తున్నాడు. తనకి బాగా అచ్చొచ్చిన సమ్మర్ రిలీజ్ కే ఈ సినిమాని కూడా విడుదల చేస్తున్నాడు బన్నె. తమిళ డైరెక్టర్ లింగు స్వామి డైరెక్షన్ లో ఒక సినిమాని ఇప్పటికే ప్రకటించిన బన్నీ ఈ సినిమా తో కాలీవుడ్ లో పాగా వెయ్యాలి అని చూస్తున్నాడు. అధికారికంగా ప్రారంభం కూడా జరుపుకోగా.. డీజే తర్వాత ఇదే సినిమాను చేయనున్నాడని తెలుస్తోంది. మరోవైపు మనం.. 24 వంటి విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్ కూడా బన్నీతో ఓ సినిమాకు ఇప్పటికే కమిటయ్యాడు. ఈ రెండు ప్రాజెక్టుల గురించి ప్రస్తుతం అంతగా మాటలు వినిపించకపోయినా.. తెర వెనక మాత్రం సన్నాహాలు స్పీడ్ గానే జరుగుతున్నాయట. కథ.. కథనం వంటివాటిని ఫైనల్ చేస్తున్నారట. లింగుస్వామి ప్రాజెక్టుకు ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసేసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు విక్రమ్ కె కుమార్ ఇంకా ఫైనల్ స్క్రిప్ట్ వినిపించాల్సి ఉందట