అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఆయనతోనేనా ?

Tuesday, April 17th, 2018, 01:06:28 PM IST

ప్రస్తుతం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా మే 4న విడుదలకు సిద్ధం అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 22న పాటలను విడుదల చేస్తున్నారు. ఇక అల్లు ఆరేంజు నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వి ఐ ఆనంద్, క్షణం ఫేమ్ రవికాంత్ పేరెపు లతో కథా చర్చలు కూడా జరిపాడు .. అయితే ఇంకా ఎవరికీ అయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కొరటాల శివ తో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. మహేష్ తో కొరటాల శివ చేసిన భరత్ అనే నేను ఈ నెల 20న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత కొరటాల శివ, రామ్ చరణ్ తో గాని లేదా అల్లు అర్జున్ తో ఉంటుందని ప్రచారం జరిగింది. ఇప్పటికే రామ్ చరణ్ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు కాబట్టి .. ఈ లోగ కొరటాల అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సో త్వరలోనే అధికారిక వివరాలు వచ్చే దాకా ఆగాల్సిందే.