తమిళ క్రేజీ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా ?

Wednesday, April 4th, 2018, 09:28:27 AM IST

తమిళంలో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న అట్లీ కుమార్ తో సినిమాలు చేయడానికి తమిళ హీరోలే కాదు తెలుగు స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. రాజా రాణి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత హీరో విజయ్ తో తేరి, మార్సల్ సినిమాలు తెరకెక్కించి టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. మెర్సల్ తరువాత అట్లీ కుమార్ తెలుగు హీరోతో సినిమా చేయాలనీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. నిజానికి అయన మహేష్ బాబు తో ఓ సినిమా చేయాలనీ ప్లాన్ చేశాడు కాని మహేష్ వేరే సినిమాలతో బిజీగా మారడంతో అయన ప్రయత్నం కుదరలేదు. ఇక ప్రభాస్ తో కూడా ప్లాన్ చేసాడు కానీ ప్రభాస్ ఇప్పటికే అటు సాహో సినిమాతో బిజీగా మారడం, మరో వైపు జిల్ దర్శకుడు రాధా కృష్ణ తో సినిమా కమిట్ అవ్వడంతో అది కుదరాలేదు. అయితే తాజాగా ఈ దర్శకుడు మరో స్టార్ హీరోని కలిసి కథ చెప్పినట్టు తెలుస్తోంది ? ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా .. అల్లు అర్జున్ !! ప్రస్తుతం నా పేరు సూర్య సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ తో సినిమా చేయాలనీ ప్లాన్ చేసిన అట్లీ కుమార్ కు అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరి మద్యే కథా చర్చలు జరిగినట్టు తెలిసింది. సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక వివరాలు వెలువడే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments