తమిళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్ ?

Saturday, October 14th, 2017, 12:08:52 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ అయింది. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా.. తమిళ దర్శకుడు లింగుస్వామి. గత కొన్ని రోజులుగా లింగు స్వామి, అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు .. చాలా రోజులుగా ఈ సినిమా పై వార్తలు వస్తున్నా కూడా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ , మొత్తానికి ఇన్నాళ్లకు కన్ఫర్మ్ అయింది. మార్చ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. మాస్ చిత్రాల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న లింగుస్వామి తో అల్లు అర్జున్ చేసే సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి మొదలైంది.

  •  
  •  
  •  
  •  

Comments