ఆ దర్శకుడిపై ఫోకస్ పెట్టిన అల్లు అర్జున్ ?

Tuesday, May 8th, 2018, 02:24:14 PM IST

మొత్తానికి నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ కెరీర్ కె టైలర్ మేడ్ ఫిలిం గా ఇది నిలిచిందని చెప్పొచ్చు. ఇక టాక్ పరంగా డివైడ్ టాక్ ఉన్నప్పట్టికీ కలక్షన్స్ మాత్రం బాగానే వర్కవుట్ అవుతున్నాయి. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పై దృష్టి పెట్టాడు. ఇప్పటికే పలువురు దర్శకులు ఆయనకు కథలు చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. ఐతే అల్లు అర్జున్ మాత్రం కొరటాలతో కానీ, లేదా సుకుమార్ తో చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట .. ప్రస్తుతం వారిద్దరూ వేరే పనుల్లో బిజీగా మారడంతో తాజాగా బన్నీ ఫోకస్ మనం ఫేమ్ విక్రమ్ కుమార్ పై పడింది. ఇప్పటికే కథను చెప్పిన విక్రమ్ కుమార్ కు బన్నీ ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదు. అయితే ఈ లోగా వేరే క్రేజీ దర్శకుడు వస్తే ఓకే లేదంటే విక్రమ్ కుమార్ తోనే నెక్స్ట్ సినిమా చేయాలనీ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ సినిమా ఎవరితో కమిట్ అవుతాడో !!

  •  
  •  
  •  
  •  

Comments