మొత్తానికి బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్?

Wednesday, May 2nd, 2018, 03:10:13 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్ని చోట్ల ప్రీమియర్ షోలను కూడా ప్లాన్ చేశారు. వక్కంత వంశీ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా తరువాత బన్నీ ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో కోలీవుడ్ దర్శకుడు లింగు స్వామితో చేస్తున్నట్లు వార్తలు వచ్చినా బన్నీ నుంచి ఎలాంటి సౌండ్ రాలేదు. అలాగే సుకుమార్ – కొరటాల శివ అన్నట్లు మరో టాక్ వచ్చింది. ఆ దర్శకులు బిజీగా ఉండడం వల్ల వారితో కాదని అర్థమైపోయింది. ఇక ఫైనల్ గా ఇప్పుడు వినిపిస్తోన్న టాక్ నిజమని తెలుస్తోంది. మనం దర్శకుడు విక్రమ్ కుమార్ గతంలోనేబన్నీకి ఒక కథను చెప్పాడు. దాన్ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిన బన్నీ స్టార్ దర్శకులతో చేద్దామని అనుకున్నాడు. కానీ వాళ్లు వేరే హీరోలతో ఫిక్స్ అయ్యారు. ఇక విక్రమ్ కుమార్ కూడా నానితో ఒక ప్రాజెక్ట్ చేయాలనీ అనుకున్నప్పటికీ అది సెట్ అవ్వలేదు. ఫైనల్ ప్రస్తుతం ఇద్దరికి సమయం దొరకడంతో ఒకటవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Comments