బాలీవుడ్ డ్రీమ్స్ లో…అల్లు అర్జున్ ?

Tuesday, May 22nd, 2018, 09:41:59 AM IST

ప్రస్తుతం అల్లు అర్జున్ ఫోకస్ మారుతున్నట్టుంది .. ఎందుకంటే ఇప్పుడు అయన టార్గెట్ అంతా బాలీవుడ్ పైనే పడిందట. బాలీవుడ్ లో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు బన్నీ. దానికి ముఖ్య కారణం తెలుగులో తాను నటించిన సినిమాలు హిందీలో డబ్ అయి .. టీవీల్లో మంచి టి ఆర్ పి రేటింగ్ లో దూసుకెళుతున్నాయి. ఇటు సౌత్ ప్రేక్షకులకే కాకుండా నార్త్ ప్రేక్షకులకు అల్లు అర్జున్ అంటే ఓ మాస్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో హిందీలో ఓ స్ట్రైట్ సినిమా చేస్తే ఆ క్రేజ్ ని ఇంకా పెంచుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నాడు. ఇక హిందీలో సంచలనం క్రియేట్ చేసిన గజని లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన గీత ఆర్ట్స్ బ్యానర్ ఎలాగూ ఉంది కాబట్టి .. మంచి దర్శకుడికోసం అన్వేషణ చేస్తున్నట్టు టాక్ !! ఇక అల్లు అర్జున్ అంటే ఇప్పటికే మలయాళ ప్రేక్షకులకు సూపర్ క్రేజ్. ఆయన్ను ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా నా పేరు సూర్య అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. మరి అల్లు అర్జున్ బాలీవుడ్ డ్రీమ్స్ ఫలిస్తాయో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments