మాస్ మసాలా పెంచమని దర్శకుడికి సూచించిన బన్నీ ?

Sunday, July 29th, 2018, 10:06:42 AM IST

నా పేరు సూర్య తరువాత అల్లు అర్జున్ తదుపరి సినిమా పై ఇంతరవరకు క్లారిటీ రాలేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపినప్పటికీ వర్కవుట్ కాలేదు. నిజానికి అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో కానీ లేదా కొరటాల శివతో చేయాలనీ అనుకున్నాడు, కానీ ఆ ఇద్దరు దర్శకులు వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో చేయాలనీ ప్లాన్ చేసాడు. ఇదివరకే కథా చర్చలు జరిగిన వీరిమధ్య కథ విషయంలో సెట్ కాలేదట, దాంతో విక్రమ్ మరో కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. అయితే ఈ సారి కాస్త మాస్ మసాలా అంశాలు గట్టిగ దట్టించాలని విక్రమ్ కు సూచించాడట బన్నీ. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్న విక్రమ్ మొదటి వారంలో ఈ కథను వినిపించేందుకు మళ్ళీ రెడీ అవుతున్నాడు. ఒకవేళ ఈ కథను బన్నీ ఓకే అంటే వెంటనే షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయ్.

  •  
  •  
  •  
  •  

Comments