ఎన్‌పీఎస్ రిపోర్ట్‌ : మ‌ల్లూ అర్జున్ బంప‌ర్ హిట్‌

Saturday, May 19th, 2018, 02:30:44 AM IST

అల్లు అర్జున్‌ని ఏనాడో మ‌ల్లూ అర్జున్‌గా వోన్ చేసుకున్నారు మ‌ల‌యాళీ అభిమానులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజులో అభిమాన సంఘాలు ఉన్నాయో, బ‌న్నికి అంత‌కుమించి మ‌ల‌యాల రాష్ట్రంలో అభిమాన సంఘాలున్నాయి. బ‌న్ని అంటే పిచ్చెత్తిపోతార‌క్క‌డ‌. ఆర్య సినిమా నుంచి స్టార్ట‌యిన ఆ ఫాలోయింగ్, ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. అస‌లు బ‌న్ని అంటే ఎంత పిచ్చో ఇటీవ‌లే ఓ ఘ‌ట‌న తెలియ‌జెప్పింది.

`నా పేరు సూర్య‌` తెలుగులో ఫ్లాప‌యినా మాలీవుడ్‌లో బంప‌ర్ హిట్ కొట్టింది. అక్క‌డ ఇటీవ‌లే `ఎంటె పేరు సూర్య ఎంటె వీడు ఇండియా` పేరుతో రిలీజైంది. ఈ సినిమా బ‌న్ని కెరీర్ బెస్ట్ రికార్డు .. యోధ‌వు (స‌రైనోడు) పేరిట ఉంది. మాలీవుడ్‌లో 7.65కోట్ల వ‌సూళ్ల‌తో బ‌న్ని గ్రాఫ్ స్కైలో ఉండ‌గా, ఇప్పుడు ఆ రికార్డును స‌వ‌రించేందుకు ఎన్‌పీఎస్ ఇంకెంతో దూరంలో లేదు. ప్ర‌స్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ వ‌సూళ్ల దూకుడు చూపిస్తోంది. కేవ‌లం తొలి వీకెండ్‌లోనే రోజుల్లోనే 5కోట్ల వ‌సూళ్లు సాధించిన ఈ చిత్రం తొలి వారం ముగిసేప్ప‌టికి స‌రైనోడు మ‌ల‌యాళం రికార్డును కొట్టేస్తుందిట‌.

  •  
  •  
  •  
  •  

Comments