బన్నీ రిజెక్ట్ చేసిన కథ బాలీవుడ్ లో..

Wednesday, March 14th, 2018, 05:30:25 PM IST

ప్రస్తుతం స్టార్ హీరోలు కథలను సెలెక్ట్ చేసుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంత పెద్ద దర్శకుడైన సరే ముందు కథ నచ్చితేనే సినిమా చేస్తున్నారు. అలంటి హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. గత కొంత కాలంగా అల్లు అర్జున్ వరుస విజయలతూ దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సరైనోడు సినిమాతో బన్నీ తన మార్కెట్ ను కూడా చాలానే పెంచుకున్నాడు. కేవలం తనకు సెట్ అయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే రీసెంట్ గా బన్నీకి ఓ ప్రముఖ దర్శకుడు చెప్పిన కథ అస్సలు నచ్చలేదట. దీంతో ఆ దర్శకుడు అదే కథను బాలీవుడ్ హీరోకి చెప్పడంతో ఒకే చేశాడని తెలుస్తోంది.

ఆ దర్శకుడు మరెవరో కాదు. మనం దర్శకుడు విక్రమ్ కె కుమార్. రీసెంట్ గా అల్లు అర్జున్ కి ఒక డిఫెరెంట్ కాన్సెప్ట్ ని చెబితే నచ్చలేదని డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేశాడట. అయితే విక్రమ్ బన్నీ రిజెక్ట్ చేసిన కథను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి చెప్పడంతో వెంటనే ఆయన ఒకే చేశారని సమాచారం. అక్షయ్ కుమార్ డిఫెరెంట్ సినిమాలను ఎక్కువగా చేస్తాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే విక్రమ్ చెప్పిన స్టోరీ అలానే ఉండడంతో వెంటనే ఒప్పుకున్నారని టాలీవుడ్ లో టాక్ వస్తోంది. మరి బన్నీ కాదన్నా కథ బాలీవుడ్ లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.