జనసేన పార్టీ పై స్పందించిన అల్లు అర్జున్ ?

Tuesday, April 10th, 2018, 09:25:49 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో మెగా హీరోల ఫాన్స్ మధ్య విభేదాలు వచ్చాయని అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. అటు పవన్ ఫాన్స్ .. ఇటు అల్లు అర్జున్ ఫాన్స్ కొన్ని విషయాల్లో వాదోపవాదాలు కూడా చేసుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ జనసేన గురించి మొత్తానికి స్పందించాడు. ఇంతకీ బన్నీ ఈ విషయం గురించి ఏమన్నాడో తెలుసా ..ఓ ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ రాజకీయాల గురించి తనకు పూర్తీ అవగాహన లేదని .. చిరంజీవిది ఏ పార్టీ అయితే తనది కూడా అదే పార్టీ అని ప్రస్తుతం చిరంజీవి ప్రజారాజ్యం విడిచి కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి తనది అదే పార్టీ అని .. ఒకవేళ ఆయనకూడా జనసేన లోకి వస్తే తనది అదే పార్టీ అని చెప్పాడు. తనకంటూ పొలిటికల్ స్టాండర్డ్ లేదని చెప్పాడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్తాపించినప్పటినుండి అల్లు అర్జున్ , రామ్ చరణ్ లు పార్టీ కోసం ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ని చిరు కాంగ్రెస్ లో విలీనం చేసాక మళ్ళీ రాజకీయాల గురించి ప్రస్తావన రాలేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కు డైరెక్ట్ గా సపోర్ట్ ఇస్తానని బన్నీ చెప్పలేదంటే .. తేడాలు ఉన్నట్టే కనిపిస్తోంది.